ఈ మధ్య కాలంలో మూవీ యూనిట్స్ సినిమా విడుదలకు ముందు గ్లిమ్స్ వీడియోలను విడుదల చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇండియన్ సినిమాలలో విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 7 గ్లిమ్స్ వీడియోలు ఏవి అనేది తెలుసుకుందాం.

టాక్సిక్ : యాష్ హీరోగా రూపొందుతున్న ఈ మూవీ యొక్క గ్లిమ్స్ వీడియోకు విడుదల 24 గంటల్లో 36 మిలియన్ వ్యూస్ దక్కాయి.

పెద్ది : రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. బుచ్చిబాబు సన ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన గ్లిమ్స్ వీడియో విడుదల చేయగా ఈ మూవీ గ్లిమ్స్ వీడియోకు విడుదల 24 గంటల్లో 31.15 మిలియన్ వ్యూస్ దక్కాయి.

పుష్ప 2 : అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీ వర్షన్ గ్లిమ్స్ వీడియోకు విడుదల అయిన 24 గంటల్లో 27.67 మిలియన్ వ్యూస్ దక్కాయి.

దేవర పార్ట్ 1 : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గ్లిమ్స్ వీడియో విడుదల అయిన 24 గంటల్లో 26.17 మిలియన్ వ్యూస్ దక్కాయి.

గుంటూరు కారం : మహేష్ బాబు హీరోగా శ్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ గ్లిమ్స్ వీడియో 24 గంటల్లో 20.98 మిలియన్ వ్యూస్ దక్కాయి.

కంగువా : సూర్య హీరోగా రూపొందిన ఈ మూవీ గ్లిమ్స్ వీడియోకి 24 గంటల్లో 20.77 మిలియన్ వ్యూస్ దక్కాయి.

పుష్ప 2 : ఈ మూవీ తెలుగు వర్షన్ గ్లిమ్స్ వీడియోకు 24 గంటల్లో 20.45 మిలియన్ వ్యూస్ దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: