
తాజాగా అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీతో కలిసి ఒక బిగ్ ప్రాజెక్టు చేయబోతున్నారని అది కూడా సన్ పిక్చర్ బ్యానర్ పైన వారి బడ్జెట్ సినిమాని చేయబోతున్నట్లు తెలుస్తోంది .అందుకు సంబంధించి సన్ పిక్చర్స్ ఈ రోజున ఒక అదిరిపోయే అప్డేట్ అభిమానుల కోసం వీడియో ద్వారా పంచుకోవడం జరిగింది. ఈ వీడియో చూస్తున్నంత సేపు ఎవరి ఊహలకు అందనంతగా ఈ వీడియో ఉన్నట్టు కనిపిస్తోంది.. డైరెక్టర్ అట్లీకి ఇది ఆరవ చిత్రమని అల్లు అర్జున్ కు 22వ సినిమా అన్నట్లుగా చూపించారు. ఇక తర్వాత సన్ పిక్చర్ అధినేతను కలవడం తర్వాత.. లాస్ ఏంజెల్ కి వెళ్ళినట్టుగా చూపించారు.
ఇక అక్కడ కొంతమంది హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ తో కూడా మీటింగ్ అయినట్లు తెలుస్తోంది. విఎఫ్ఎక్స్ కూడా అదిరిపోయేలా ఉండాలని ప్లాన్ చేస్తున్నట్లు డైరెక్టర్ అట్లు కనిపిస్తోంది. అక్కడ కొంతమంది పలు సినిమాలకు సంబంధించిన విఎఫ్ఎక్స్ టెక్నీషియన్సీతో అట్లీ అల్లు అర్జున్ మాట్లాడడం జరిగింది. ఈ సినిమా కూడా టెక్నికల్ పరంగా ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. అలాగే పెద్దపెద్ద గన్నులు కూడా చూపించారు. మరి లేకపోతే హర్రర్ జోనర్లు తెరకెక్కిస్తున్నారు అన్న విషయం ఇంకా క్లారిటీ రావాలి.
మొత్తానికి ఒక్క ఇంట్రడక్షన్ వీడియోతోనే భారీ హైప్ పెంచేశారు డైరెక్టర్ అట్లీ. ఇందులో అల్లు అర్జున్ ఫేసును కూడా స్కానింగ్ చేయడం జరిగింది. మరి పూర్తి సమాచారం తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆడాల్సిందే.