కొన్ని కొన్ని కాంబోలు ఎంత ఎదురుచూసిన అస్సలు తెరకెక్కించలేరు డైరెక్టర్స్ . కొన్నిసార్లు అవి సెట్ అయినట్లే అయి క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి . అది మహా మహా టార్చర్ . ఎందుకంటే అలాంటి కాంబో మరొకసారి చూడలేము అని జనాలు ఫీల్ అయిపోతూ ఉంటారు . అలాంటి ఒక కాంబోనే రవితేజ - కీర్తి సురేష్.  రవితేజ మాస్ హీరో కీర్తి సురేష్ సైలెంట్ హీరోయిన్..  వీళ్లిద్దరి కాంబోలో సినిమా అంటే కచ్చితంగా జనాలు నవ్వుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు .


కానీ రవితేజ ఫ్యాన్స్ కీర్తి సురేష్ ఫ్యాన్స్ మాత్రం ఎన్నిసార్లు కోరుకున్నారో వీళ్ల కాంబో సెట్ అవ్వాలి అని.. కానీ అది మాత్రం వర్కౌట్ అవ్వలేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రవితేజ తన కెరీర్ లో ఎంతో కష్టపడి పైకి ఎదిగాడు. రవితేజ తన కెరీర్ లో ఎన్నో సినిమాలల్లో నటించాడు . హిట్స్ అందుకున్నాడు.  ఫ్లాప్స్ అందుకున్నాడు.  తన ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఎక్కడ తగ్గకుండా మెయింటైన్ చేస్తూ వచ్చాడు . అలాంటి రవితేజతో కీర్తి సురేష్ కాంబో సెట్ అయితే బాగుండు అనేది ఫ్యాన్స్ కోరిక .



కానీ వీళ్ళ కాంబోలో సినిమా రానే రాలేదు . కానీ ఒక డైరెక్టర్ మాత్రం వీళ్ళ కాంబో సెట్ చేయాలని చూసాడు . ఆయన మరెవరో కాదు త్రినాధ్ రావు నక్కిన . ధమాకా సినిమా డైరెక్టర్ . ధమాకా సినిమాలో ముందుగా శ్రీ లీలా కన్నా కూడా హీరోయిన్గా కీర్తి సురేష్ ని అనుకున్నారట . కానీ కొన్ని కారణాల చేత కీర్తి సురేష్ ఈ ప్రాజెక్టు ను రిజెక్ట్ చేసిందట. ఒకవేళ కీర్తి సురేష్ మనసు మార్చుకుని ఈ రోల్ చేసి ఉంటే మాత్రం ఆమె ఖాతాలో 100 కోట్ల హిట్ ఉండేది . మహానటి తర్వాత అలాంటి ఒక క్రేజీ హిట్ కోసం ట్రై చేస్తున్న కీర్తి సురేష్ కు ఈ సినిమా బాగా వర్క్ అయి ఉండేది . బ్యాడ్ లక్ ఏం చేద్దాం..!??

మరింత సమాచారం తెలుసుకోండి: