సినిమా ఇండస్ట్రీ లో ఎవరికైతే మంచి విజయాలు తక్కుతాయో వారికే వరుస పెట్టి క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కుతాయి. కానీ చాలా తక్కువ మందికి మాత్రం విజయాలు లేకపోయినా మంచి అవకాశాలు దక్కుతూ ఉంటాయి. ఇకపోతే సినిమా ఇండస్ట్రీ లో హీరోలతో పాటు హీరోయిన్లకు విజయాలు చాలా కీలకం. మంచి విజయాలు ఉన్న హీరోయిన్లకు స్టార్ హీరోల సినిమాలలో ఎక్కువ శాతం అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అలా మంచి విజయాలను దక్కించుకొని స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు 
దక్కించుకున్న ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ స్టేటస్ కి చాలా త్వరగా చేరుకునే అవకాశాలు కూడా ఉంటాయి.

ఇకపోతే ఓ ముద్దుగుమ్మ ఇప్పటివరకు నాలుగు సినిమాల్లో నటించగా ఒక్క మూవీ ద్వారా కూడా మంచి విజయం దక్కలేదు. కానీ ఆమెకు వరుస పెట్టి క్రేజీ సినిమాల్లో అవకాశాలు మాత్రం దక్కుతున్నాయి. ఇంతకు ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆ బ్యూటీ మరెవరో కాదు మిస్ వరల్డ్ మనుషి చిల్లర్. ఈ నటి అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన సామ్రాట్ పృధ్విరాజ్ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈ నటి ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ అనే సినిమాలో నటించింది. 

మూవీ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఆ తర్వాత ఈమె వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ నటి బడే మియాన్ చోటే మియాన్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇలా ఈమె ఇప్పటి వరకు నటించిన నాలుగు సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టిన కూడా ఈ బ్యూటీ కి ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: