ఓవైపు స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలతో దుమ్ము రేపుతుంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం గ్లోబల్ స్టార్ ట్యాగ్ లైన్ కు న్యాయం చేయలేకపోతున్నాడు. ఇటీవల శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. దాదాపు 140 కోట్ల వరకు ఈ సినిమాకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ పెద్ది అనే సినిమాలో నటిస్తున్నాడు.

సినిమా వచ్చేయడాది ప్రేక్షకులు ముందుకు రానుంది. మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కూడా అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దీని వెనుక రీజన్ కూడా ఉంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలకు జనాల నుంచి ఆదరణ ఎక్కువ.

అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన లగాన్ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే పలువురు క్రికెటర్ల జీవిత కథల ఆధారంగా వచ్చిన సినిమాలకు కూడా మంచి ఆదరణ లభించింది. ఇక నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమాకు కూడా తెలుగులో భారీ వసూళ్లు వచ్చాయి. దీనితో ఇప్పుడు పెద్ది సినిమాకు కూడా అదే రేంజ్ లో కలెక్షన్లు ఉండబోతున్నాయని.. ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయబోతుందని మెగా ఫాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. రామ్ చరణ్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉందని మరోసారి రంగస్థలం సినిమాను మరిపించే రేంజ్ లో రామ్ చరణ్ యాక్టింగ్ ఉండబోతుందంటూ మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లతో సినిమాపై భారీగా బజ్ క్రియేట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: