బాలీవుడ్లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న మలైకా అరోరా గురించి చెప్పాల్సిన పని లేదు.. ఈమె 2012లో ఒక రెస్టారెంట్ కి  వెళ్లగా అక్కడ ఒక పెద్ద గొడవ జరిగిందట..  అయితే ఈ కేసులో నటి మలైకా అరోరా సాక్షిగా ఉన్నది. ఈ కేసు విచారణలో భాగంగా గత కొంతకాలంగా జరుగుతూనే ఉన్నది. ఇప్పటికే కూడా ఈ కేస్ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అందుకు కారణం ఈ కేసులో ఉన్న వారందరూ కూడా హాజరు కాకపోవడం వల్లే అన్నట్లుగా పలు రకాల వార్తలు వినిపించాయి.


ఈ కేసులో మలైకా ఆరోరా కూడా కోర్టుకు వెళ్లి మరి సాక్ష్యం చెప్పాల్సి ఉన్నదట. అయితే ఎప్పటికప్పుడు కోర్టు ఆదేశాలను ఇస్తూ ఉన్నప్పటికీ వాటిని ధిక్కరిస్తూ వస్తోందట. గతంలో ఒక వాయిదా సందర్భంగా మలైక అరోరాను హాజరుకావాలని కోర్టు ఆదేశించగా లేకపోతే అరెస్టు వారెంట్ కూడా జారీ చేస్తామంటూ హెచ్చరించారు.. అయితే ఈ అరెస్టు వారిని సైతం మలైకా అసలు పట్టించుకోలేదు. ఈమెను అరెస్టు చేసి కోర్టు ముందర నిలబెట్టాలని సూచించిన కూడా పోలీసులు అరెస్టు చేయడంలో విఫలమయ్యారని తెలుస్తోంది.


దీంతో కోర్టు మరొకసారి మలైకా అరోరా మీద సీరియస్ గా వ్యాఖ్యలు చేసిందట. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా రానందుకు గాను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది అంటూ కోర్టు తెలిపిందట. అరెస్ట్ వారెంట్ ను వెంటనే జారీ చేయడంతో పాటుగా కోర్టు సమయాన్ని అగౌరవపరిచినందుకు కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందంటూ పలు రకాల వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నటుడు సైఫ్ అలీ ఖాన్ , మలైక ఆరోరా ,కరీనాకపూర్ తదితర స్నేహితులతో అందరూ కలిసి రెస్టారెంట్ కి వెళ్ళాగా ఆ రెస్టారెంట్ కి వచ్చిన ఒక కస్టమర్తో సైఫ్ అలీ ఖాన్ గొడవపడ్డారట.. దీంతో ఆ కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు కూడా ఫైల్ అయ్యింది. అక్కడ మలైకా ఆరోరానే సాక్షిగా ఉన్నది. మరి ఇప్పటికైనా కోర్టుకు వెళ్లి మరి అసలు నిజం చెప్పాల్సి ఉంటుంది. మరి మలైక ఆరోరా అరెస్టు వారెంట్ పైన ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: