- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

చిత్ర పరిశ్రమ లో కొన్ని నిర్మాణ సంస్థల కు కలిసి వచ్చిన హీరోలు ఉంటారు .. ఒక్కో బ్యానర్ .. కొంతమంది హీరోల కే ఎక్కువగా పరిమితం అవుతూ ఉంటుంది .. అలాగే వారి తోనే ఎక్కువగా పదే పదే సినిమాలు కూడా చేస్తూ ఉంటుంది .. అయితే అదే సెంటిమెంట్ హీరోయిన్ విషయం లో పెద్దగా ఎక్కడా కనిపించదు .. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లతోనే ప్రొసీడ్ అవుతూ ఉంటారు .. అయితే ఇక్కడ కాకపోతే సితార  ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ కు సంయుక్త మీన‌న్ సెంటిమెంట్ గా మారిపోతోందేమో  అని కూడా అనిపిస్తుంది .. సితార తీసిన భీమ్లా నాయక్ , సార్ సినిమాల్లో సంయుక్త హీరోయిన్ గా నటించింది .. ఇక ఇప్పుడు మరోసారి ఈ బ్యానర్లో సంయుక్త మరోసారి వర్క్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది ..


సూర్య , వెంకీ అట్లూరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది .. ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త ని ఎంచుకున్నట్టు వార్తలు వస్తున్నాయి .. ఇక మొన్నటి వరకు ఈ హీరోయిన్ పోస్ట్ కోసం  భాగ్య‌శ్రీ బోర్సే , క‌యాదు లోహార్  పేర్లు గట్టిగా వినిపించాయి .. ఇక ఎప్పుడైతే సంయుక్త కన్ఫామ్ అంటున్నారు .. అదే జరిగితే సితార లో సంయుక్త కు ఇది హ్యాట్రిక్ సినిమా గా మారనుంది . లక్కీ భాస్కర్ తో ఇప్పటికే భారీ హిట్‌ కొట్టాడు వెంకి అట్లూరి .. ఇది కూడా సితార సంస్థ నిర్మించిన సినిమానే .. ఇప్పుడు ఇదే బ్యానర్ లో వెంకీ కూడా మరో సినిమా చేయబోతున్నాడు .. అలాగే చిరంజీవి కి కూడా వెంకి ఒక కథ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి .. ఇక ఈ సినిమా కూడా సితార సంస్థ నిర్మించబోతుందని కూడా అంటున్నారు. ఈ లెక్కన వెంకీ అట్లూరి కూడా సితారాలో హ్యాట్రిక్  కొట్ట‌బోతున్నాడ‌న్న‌మాట ..

మరింత సమాచారం తెలుసుకోండి: