
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ తాజా మూవీ విశ్వంభర .. బింబిసార దర్శకుడు వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు .. ఇక చిరంజీవి కి జంటగా స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది .. ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది .. ఇక చాలాకాలంగా సెట్స్ పై ఉన్న విశ్వంభర నుంచి ఈ మధ్య రిలీజ్ అవుతున్న పోస్టర్స్ లో చిరు లుక్ మెగా అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నాయి .. అలాగే వింటేజ్ చిరు ఇస్ బ్యాక్ అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి .. అలాగే ఈ సంతోషాన్ని మరింత రెట్టింపు చేసేందుకు ఈ సినిమా యూనిట్ మరో గుడ్ న్యూస్ కూడా అందించింది .. విశ్వంభర ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తుంది ..
ఇక ఈనెల 12న హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వంభర తొలి సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు .. అలాగే అందుకోసం కృష్ణాజిల్లా నందిగామ లోని పరిటాల ఆంజనేయస్వామి గుడి వద్ద విశ్వంభర మొదటి సాంగ్ ను విడుదల చేయబోతున్నారు .. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమా కు సంగీతమందిస్తున్నారు .. అలాగే చిరంజీవి నుంచి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడం తో మెగా అభిమానుల తో పాటు చిరంజీవి అభిమానులు కూడా విశ్వంభర పై భారీ అంచనాలు పెట్టుకున్నారు .. జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి సినిమా మరోసారి రాబోతుందని అభిమానులు కూడా ఎంతో ఆనందిస్తున్నారు .. అయితే సోషియో ఫాంటసీ కథ నేపథ్యం కావడంతో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండటం తో క్వాలిటీలో ఎక్కడ ఎలాంటి కాంప్రమైజ్ కాకూడదని ఎంతో జాగ్రత్త తీసుకోవటం తో .. విశ్వంభర రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ లేదు ..