మన సౌత్ ఇండియాలో పండగ అంటే సినిమా సినిమా అంటేనే పండగ .. ప్రధానంగా సినీ ప్రేమికులకు ఏ ఫెస్టివల్ వచ్చినా సరే అప్పుడు సినిమా ఉండాల్సిందే.   ఈ ఏడాది ఉగాది మరియు రంజాన్ కనుకగా చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి .. ఇక అందులో మోహన్ లాల్ , సల్మాన్ ఖాన్ , విక్రమ్‌ , నితిన్ వంటి హీరోల సినిమాలు ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అయ్యాయి .. అలాగే భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమాలు ఏప్రిల్ 6 వరకు రాబట్టిన కలెక్షన్స్ ఫైనల్ రిజల్ట్ ఏంటో ఒకసారి ఇక్కడ తెలుసుకుందాం ..


ఎంపురాన్‌ : మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ , పృథ్వి రాజ్ సుకుమారన్ నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి మిక్డ్స్ టాక్ ను తెచ్చుకుంది .. కానీ కలెక్షన్లు మాత్రం టక్ తో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా 263 కోట్లకు పైగా రాబట్టి కేరళ చిత్ర పరిశ్రమ లోని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది .. అయితే మిగిలిన ఇండస్ట్రీలో మాత్రం ఈ సినిమా ప్లాఫ్ గా నిలిచింది .


సికిందర్ : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు మురగదాస్ కాంబోలో వచ్చిన ఈ సినిమా రంజాన్ కానుకగా  గత నెల 30న రిలీజ్ అయింది .. మొదటి షో నుంచి ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది .. ఇప్పటివరకు ఈ సినిమా 150 కోట్లు రాబట్టి డిజాస్టర్ గా నిలిచింది అయితే నార్త్ లో ఓ మాదిరి కలెక్షన్స్ రాగా సౌత్ లో మాత్రం క్లీన్ డిజాస్టర్ గా మిగిలింది .


వీర ధీర సూరన్ : కోలీవుడ్ స్టార్ విక్రమ్ నటించిన ఈ సినిమా మార్చి 27న ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాని కారణంగా ఉద‌యం ఆటలు క్యాన్సిల్ అయ్యాయి సాయంత్రం ఆటతో రిలీజ్ అయింది .. రీసెంట్ తమిళ్ బెస్ట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైర్నర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా 62 కోట్ల గ్రాస్ ను అందుకుని బిలో యావరేజ్ గా మిగిలింది .


రాబిన్ హుడ్ : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ఈ సినిమా గత నెల 27న విడుదలవ‌గా మార్నింగ్ షో నుంచి ప్లాప్ టాక్‌ తెచ్చుకుంది .. దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 12 కోట్ల రాబట్టి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది .. అలాగే నితిన్ ప్లాపుల పరంపరను మరో మెట్టు పైకి తీసుకువెళ్లింది .


మ్యాడ్ స్క్వేర్ ; టాలీవుడ్ లో వచ్చిన మ్యాడ్‌ సినిమాకు సీక్వల్ గా వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న కూడా భారీ కలెక్షన్స్ అందుకుంది .. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 67 కోట్లు రాబట్టి బయ్యర్స్ కు భారీ లాభాలు తెచ్చబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ..

మరింత సమాచారం తెలుసుకోండి: