
ప్రస్తుతం తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న దీపిక చివరగా టాలీవుడ్ కల్కి సినిమాలో నటించి సౌత్ ప్రేక్షకులను కూడా మెప్పించింది .. అయితే ఈ స్టార్ హీరోయిన్ నుంచి వస్తున్న తాజా సమాచారం ప్రకారం మరోసారి ఈ బ్యూటీ తల్లి పాత్రలో నటించబోతుందట .. బాలీవుడ్ హిట్ జోడిలో షారుక్ ఖాన్ , దీపిక పదుకొణెలా జంట కూడా ముందు వరుసలో ఉంటుంది .. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఓం శాంతి ఓం , చెన్నై ఎక్స్ప్రెస్ , పఠాన్ లాంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి .. అయితే ఇప్పుడు ఈ జంట మరోసారి తెరపైకి రాబోతుందట .. షారుక్ ఖాన్ ఆయన కూతురు సుహానా ఖాన్ ప్రధాన పాత్రలో కింగ్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసింది ..
సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపిక కూడా ఒక ప్రత్యేక పాత్రల్లో నటించబోతున్నట్టు తెలుస్తుంది .. అది కూడా సుహానాకు తల్లిగా దీపికను ఓకే చేశారట చిత్ర యూనిట్ .. ప్రతికార నేపథ్యంలో యాక్షన్ డ్రామగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించడానికి దీపిక కూడా ఎంతో ఉత్సాహంగా ఉందట .. ప్రస్తుతం ఈ ఈ విషయంపై ఆమెతో పాటు చర్చలు జరుపుతుంది చిత్ర యూనిట్ .. అలాగే దీని గురించి త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుంది.