నటి పాయల్ రాజ్ పుత్ తండ్రి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తన తండ్రికి క్యాన్సర్ వ్యాధి వచ్చినట్లుగా నటి పాయల్ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే.... నటి పాయల్ రాజ్ పుత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ చిన్నది ఎన్నో సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పాయల్ రాజ్ పుత్ తనదైన నటన, అందం, అభినయంతో ప్రేక్షకులు మనసులను దోచుకుంది.



ఆ సినిమాతో ఎంతో సక్సెస్ వచ్చినప్పటికీ ఈ బ్యూటీకి పెద్దగా సినిమా ఆఫర్లు రాలేదు. ఏవో కొన్ని సినిమాల్లో మాత్రమే హీరోయిన్ గా చేసింది. అయితే పాయల్ రాజ్ పుత్ సినిమా ఆఫర్లు రావడం లేదంటూ గత కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. టాలెంట్ ఉన్నవారికి పెద్దగా ఆఫర్లు రావడం లేదని.... ఇక్కడ నెపోటిజం మాత్రమే పని చేస్తుందా అనే విధంగా పాయల్ మాట్లాడారు. అయితే నటి పాయల్ తన తండ్రి హెల్త్ అప్డేట్ గురించి వెల్లడించారు.


తన తండ్రి ఏసోఫాజిల్ కార్సినోమా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడని పాయల్ తన ఆవేదనను వ్యక్తపరిచింది. గత కొన్ని రోజుల నుంచి తన తండ్రికి క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని పాయల్ చెప్పారు. కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యానికి నటి పాయల్ స్పెషల్ గా థాంక్స్ చెప్పారు. ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్లందరికీ థాంక్స్ చెబుతూ పాయల్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు.

పాయల్ షేర్ చేసుకున్న ఈ పోస్ట్ ని చూసి సెలబ్రిటీలు అందరూ స్పందిస్తూ నటి పాయల్ కు ధైర్యాన్ని ఇస్తున్నారు. రాయ్ లక్ష్మి, దివ్య పిళ్లై, సిమ్రాత్ కౌర్ లాంటి వారందరూ స్పందిస్తూ పాయల్ కు ధైర్యాన్ని అందిస్తున్నారు. ఇక ఈ పోస్ట్ చూసిన తన అభిమానులు మీ తండ్రి తొందర్లోనే కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తామంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: