పవన్ కళ్యాణ్ బర్త్డ డే తర్వాత ఫ్యాన్స్ అంతలా ఎంజాయ్ చేసే రోజు ఏదైనా ఉంది అంటే మాత్రం అది కచ్చితంగా ఏప్రిల్ 8 అనే చెప్పాలి . ఇవాళ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ పుట్టినరోజు . సోషల్ మీడియాలో అప్పుడే అకిరానందన్ కి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది . పవన్ కళ్యాణ్ బర్త్డ డే కి ఎంతటి హంగామా చేస్తారో ..? అంతకు డబుల్ కాదు ట్రిపుల్ స్థాయిలోనే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ బర్త డే హ్యాష్ ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు .


మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అఖీరానందన్ సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వాలి అని కోరుకుంటున్నారు . చాలామంది స్టార్స్ ప్రముఖ ఈవెంట్లలో ఈ విషయంపై ప్రస్తావిస్తూనే వస్తున్నారు. అయితే ఇవాళ ఆయన బర్త డే.  ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరానందన్ సినీ ఎంట్రీ కి సంబంధించిన డీటెయిల్స్ అనౌన్స్ చేస్తారని అంతా అనుకున్నారు . ఖచ్చితంగా ఆ స్పెషల్ అనౌన్స్ మెంట్ ఇవాళ్ల ఇస్తారు అని ఆశలు పెట్టుకున్నారు. దూం ధాం అంటూ రచ్చ చేసేద్దాం అని అనుకున్నారు. కానీ మొత్తం బిస్కెట్ అయిపోయింది.



అయితే అటువంటి ఏ అఫీషియల్ ప్రకటన రాకపోవడంతో పవన్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు . అంటే ఈ సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్ కొడుకు సినిమా లేనట్టేనా..?? ఇంకో సంవత్సరం వేచి చూడాల్సిందేనా ..??అంటూ డీలా పడిపోతున్నారు . పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయడు. రాజకీయాలలో ఫుల్ బిజీగా మారిపోయాడు . మరి పవన్ కళ్యాణ్ కొడుకు అయినా సరే త్వరగా సినిమాలలో నటిస్తే బాగుంటుంది అంటూ ఆశపడుతున్నారు . చూద్దాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరిక ఎప్పటికి నెరవేరుతుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: