డైరెక్టర్ కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతను డైరెక్టర్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గాను ఎంతో సక్సెస్ అయ్యారు. డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా మాత్రమే కాకుండా షో హోస్ట్ గా అభిమానుల మనసులను దోచుకున్నారు. బాలీవుడ్ బ్యాడ్ బాయ్ అనే ట్యాగ్ తోనే కరణ్ జోహార్ వైరల్ అవుతున్నారు. కాఫీ విత్ కరణ్ షోతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ అండ్ సెక్సువల్ లైఫ్ గురించి అడుగుతూ ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తాడు.


ఈ షో ద్వారా కరణ్ జోహార్ తనకు విపరీతమైన పాపులారిటీ వచ్చేలా చేసుకున్నాడు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క హీరో, హీరోయిన్ వ్యక్తిగత విషయాలను అడిగి తెలుసుకోవడమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాడు. కరణ్ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ షోకు విపరీతంగా పాపులారిటీ ఉంది. ఈ ప్రోగ్రామ్ నీ ఎంతోమంది అభిమానులు ఇష్టంగా చూసేవారు.


ఇదిలా ఉండగా.... కరణ్ జోహార్ కొత్త రూపంతో ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చాడు. అతడి కొత్త రూపం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపోయేలా చేసింది. కరణ్ జోహార్ పూర్తిగా సన్నగా మారిపోయాడు. గుబులు గుబులుగా భయంగా కనిపించాడు. కళ్లద్దాలు పెట్టుకొని ఉన్నాడు. కానీ ముఖంలో కళ పూర్తిగా పోయింది. బట్టతల స్పష్టంగా కనిపించడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. బుగ్గలు లోతుగా అయ్యాయి. పూర్తిగా కరణ్ జోహార్ వికారంగా మారిపోయాడు.

మొన్నటి వరకు మన్మధుడిలా ఇస్మార్ట్ లుక్ లో కనిపించిన కరణ్ జోహార్ ఉన్న ఫలంగా ఇలా అవడానికి కారణమేంటి? అతనికి ఏమైంది? ఆరోగ్యం బాగాలేదా? ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా? అంటూ అభిమానులు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కరణ్ జోహార్ ను అలా చూడగానే నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కరణ్ జోహార్ కు అసలు ఏమైంది? ఏంటి? అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: