నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అమాయకమైన నటన, ఆకట్టుకునే రూపం, చక్కటి అందం, అచ్చ తెలుగు అమ్మాయి వలె కనిపించే ఈ చిన్నది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తన సినిమాల ద్వారా అభిమానుల మనసులను గెలుచుకుంది. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి వారి మనసులను మాయ చేసింది. ఈ సినిమా అనంతరం వరుసగా తెలుగు సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.



ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ చిన్నది తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా నటిస్తూ ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది. ఇదిలా ఉండగా.... సమంత గత కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో సమంత ఇక బ్రతకదేమో అని కూడా భయపడ్డారు.


మయోసైటిస్ వ్యాధితో విపరీతంగా బాధపడిన సమంత వేగంగా  కోలుకున్నారు. తన వ్యాధికి అమెరికాకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకొని కఠినమైన డైట్ ఫాలో అయ్యి అతి వేగంగా కోలుకుంది. సమంత మయోసైటీస్ వ్యాధికి ట్రీట్మెంట్ కోసం చాలా డబ్బులను ఖర్చు పెట్టింది. ఆ సమయంలో సమంత వద్ద డబ్బులు లేకపోవడంతో ఓ టాలీవుడ్ హీరో దగ్గర సమంత డబ్బు తీసుకుందట.


హీరో సమంతకు దాదాపు రెండు కోట్ల రూపాయలు ఇచ్చాడట. ఆ డబ్బులతో సమంత ట్రీట్మెంట్ తీసుకొని సక్సెస్ అయింది. ఆ వ్యాధి నుంచి బయటపడిన సమంత అతివేగంగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మళ్లీ తన హవాను కొనసాగిస్తుంది. ఆ హీరో ఎవరు ఏంటి అనే విషయాలు బయటకు రానప్పటికీ సమంతా కోల్పోవడంతో తన అభిమా నులు అందరూ సంతోషపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: