హీరోయిన్ తమన్నా, డైరెక్టర్ సంపత్ నంది కథతో డైరెక్టర్ అశోక్ తేజ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఓదెల-2 ఈ సినిమా గతంలో వచ్చిన ఓదెల సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కించారు. గతంలో హెబ్బా పటేల్ ఇందులో హీరోయిన్ గా నటించగా ఇప్పుడు తాజాగా ఓదెల 2 సినిమాలో తమన్నా నాగ సాధు పాత్రలో కనిపించబోతోంది. ఇక ట్రైలర్ కోసం ఎప్పుడెప్పుడా అంటూ అభిమానులు ఎదురు చూడగా తాజాగా చిత్ర బృందం ట్రైలర్ ని రిలీజ్ చేయగా ఇందులో వశిష్ట సింహ, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలకమైన  పాత్రలో నటించినట్లు కనిపిస్తోంది.


ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. భరత ఖండాలో దక్షిణ గంగా  తీరాన ఆ పరమాత్ముని పుట్టినిల్లు అయిన ఓదెలలో ఒక ప్రేతాత్మ పురుడు పోసుకుంటోంది. ఇక ఆవిరైన ప్రతి రక్తపు బొడ్డుని కూడా అవకాశం కోసం నిరీక్షిస్తోంది. అంటూ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు భయభ్రాంతులకు గురయ్యాలా చేస్తున్నాయి. మురళి శర్మ ఆత్మ గురించి చెప్పే డైలాగ్ కూడా హైలెట్ గా ఉన్నది.. శ్రీకాంత్ అయ్యంగార్ చూసే చూపు కూడా ఇందులో చాలా భయంకరంగానే కనిపిస్తోంది.


మనం నిలబడాలంటే భూమాత.. మనం బ్రతకాలంటే భూమి అనే చెప్పే డైలాగ్ తో తమన్నా ఎంట్రీ ఇస్తోంది. ఇక ఆ తర్వాత ప్రేతాత్మలకు నాగ సాధు తమన్నా మధ్య జరిగే సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తూ ఉన్నాయి. ఈ ట్రైలర్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ తెప్పించేలా కనిపిస్తున్నాయి. ఇక తమన్నా తన శక్తితో ప్రేతాత్మని  ఎలా ఎదుర్కొంటుంది అనే కాన్సెప్టే ఓదెల-2 అన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నారు. ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మరి ట్రైలర్ మాత్రం సూపర్ గా అభిమానులను మెప్పిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: