నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ “అర్జున్ సన్ ఆఫ్ విజయంతి”.. నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఎంతో గ్రాండ్ గా తెర కెక్కిన ఈ మూవీ తాజాగా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసింది.ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 24 నిమిషాలుగా వుంది.పర్ఫెక్ట్ యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెర కెక్కింది..ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు.ఈ సినిమాను అశోక క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక వర్ధన్ ముప్ప మరియు సునీల్ బలుసు నిర్మించారు. ఏప్రిల్ 18 న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

తాజాగా విడుదల అయిన సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మరియు విజయశాంతి అద్భుతమైన నటనతో అలరించారు. విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో బలమైన తల్లి పాత్రను పోషిస్తూ, కళ్యాణ్ రామ్‌తో కలిసి ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించారు.. తల్లి-కొడుకు మధ్య సంఘర్షణ కథకు ప్రధాన ఆధారంగా నిలిచింది..విజయశాంతి న్యాయం కోసం పోరాడుతుండగా, కళ్యాణ్ రామ్ తన సొంత మార్గంలో నేరస్థులపై పోరాడటం కథను ఆసక్తికరంగా మలుస్తుందని తెలుస్తుంది. తల్లి, కొడుకు మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టి పడేస్తాయి..

సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అస్సలు ఊహించని విధంగా ఉంటుందని సమాచారం..కళ్యాణ్ రామ్ యాక్షన్ అవతార్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుందట.. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోయడంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషన్ యాక్షన్ సీన్స్. ను మరింత ఎలివేట్ చేస్తుందని సెన్సార్ రిపోర్ట్ లో వుంది...ఈ సినిమాలో.సాయి మంజ్రేకర్, సోహైల్ ఖాన్, శ్రీకాంత్ వంటి నటీనటులు కూడా కీలక పాత్రలలో నటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: