ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయం అనవసరం. ఈ అందాల భామ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సాధించింది. రకుల్ తన అందం, అభినయంతో అందరి మనసు దోచుకుంది. ఎన్నో సినిమాల్లో గ్లామర్ రోల్స్ పోషిస్తూ ప్రేక్షకులను అలరించింది. ఈ బ్యూటీ 'కొండపొలం' తర్వాత తెలుగు పరిశ్రమ నుండి దూరంగా వెళ్లింది. అయితే ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో వెలుగు వెలిగిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఈమె ప్రస్తుతం ఇతర భాషలలో నటిస్తుంది.
 
ఇక ఈ బ్యూటీ గతేడాది ఫిబ్రవరి నెలలో పెళ్లి చేసుకుంది. జాకీ భగ్నని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. రకుల్ ప్రీత్ సింగ్ గోవాలోని ఓ రిసార్ట్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వివాహం చేసుకుంది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో తన సినీ ఇండస్ట్రీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. ఆమె మాట్లాడుతూ.. 'సినీ ఇండస్ట్రీలో జయాలు, అపజయాలు అనేవి వస్తు పోతుంటాయి. అవి కూడా మన జీవితంలో భాగమే. ఎన్ని కష్టాలు వచ్చిన కూడా తిరిగి రెట్టింపు చేసుకుని ఉత్సాహంతో ముందుకి వెళ్లాలి. మనపైన మనకి నమ్మకం ఉండాలి. అలా ఉనప్పుడే మనం విజయం సాధిస్తాము. నా జీవితం విషయానికి వస్తే.. నేను ఎంత బిజీగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటాను. ఎక్కువ షూటింగ్ లు ఉంటే నాకు ఒత్తిడి అనిపించదు. షూటింగ్ లు లేనప్పుడే నాకు చాలా ఒత్తిడి అనిపిస్తాది. ప్రతిరోజూ వర్క్ కి వెళ్లడం, కెమెరా ముందు ఉండడం నాకు ఇష్టం. ఇది ఎప్పటికే ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను' అని రకుల్ చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ అందాల భామ గిల్లీ అనే కన్నడ సినిమాలో నటించింది. ఈ సినిమాతో రకుల్ కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ మూవీకి ఈమె భర్త జాకీ భగ్ననే నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈమె దే దే ప్యార్ దే 2 సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో అజయ్ దేవ్ గణ్, మాధవన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: