మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా గురించి పరిచయం అనవసరం. ఈ బ్యూటీ అందాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ అందాల భామ తెలుగుతో పాటుగా తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈమె ఇప్పటికే దాదాపు 75పైగా సినిమాలలో నటించింది. ఈమె చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ సినిమాతో తన నటన జీవితాన్ని మొదలుపెట్టింది. తెలుగులో శ్రీ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తన నటనతో మంచి సినిమా అవకాశాలను కొట్టేసింది.

ఈ ముద్దుగుమ్మ హ్యాపీ డేస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, ఊసరవెల్లి, బాహుబలి, రచ్చ, తడాఖా, ఊపిరి, ఎఫ్ 1 అండ్ 2, సైరా నరసింహ రెడ్డి, బెంగాల్ టైగర్ సినిమాలలో నటించింది. అయితే గ్లామరస్ హీరోయిన్ తమన్నా, నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు అందరికీ తెలుసు. వీరిద్దరూ 2023లో లాస్ట్ స్టోరీస్ 2 సిరీస్ లో కలిసి పనిచేశారు. ఈ సిరీస్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరిద్దరూ నిత్యం వార్తల్లో నిలిచేవారు. తమన్నా, విజయ్ కూడా వారి ప్రేమ గురించి చాలా సార్లు  బయటపెట్టారు. తమన్నా, విజయ్ ఎక్కడికి వెళ్లిన కలిసే వెళ్లేవారు, కలిసే తిరిగేవాళ్లు.

అయితే ఇటీవల వీరిద్దరూ విడిపోయారు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలా వార్తలు వచ్చినప్పటికీ ఇద్దరిలో ఒక్కరూ కూడా స్పందించలేదు. ఇదిలా ఉండగా.. ఈ మిల్క్ బ్యూటీ తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఫోటోస్ షేర్ చేసింది. రెడ్ డ్రెస్ లో ఈ భామ మెరిసిపోతుంది. ఎంతో ముద్దుగా ముస్తాబై కనిపించింది. ఇక తన ఫోటోస్ చూసిన నెటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతూ.. షేర్ చేస్తున్నారు. లైక్స్ కూడా కొడుతున్నారు. ఇక ఈ ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: