
ఈ ఘటనలో తన సోదరుడు విష్ణు ఉన్నారంటూ ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించడం జరిగింది మనొజ్.. ఇవే కాకుండా మనోజ్ తన ఫిర్యాదులో పలు వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. తన కూతురి బర్తడే సందర్భంగా తాను కుటుంబంతో కలిసి రాజస్థాన్ కి వెళ్ళిన సమయంలో విష్ణు తన ఇంటిలోకి చొరబడి మరియు విధ్వంసం చేశారని ఆరోపణలు చేశారు. తన ఇంట్లో ఉండి విలువైన కొన్ని వస్తువులతో పాటు కార్లను కూడా ఎత్తుకెళ్లారని.. ఇంట్లోకి రావడానికి గోడలు దూకారని.. కొన్ని ముఖ్యమైన వస్తువులను పగలగొట్టి ఇల్లుని ధ్వంసం చేశారంటూ మనోజ్ ఫిర్యాదులు తెలియజేసినట్లు తెలుస్తోంది.
చోరీ అయిన కార్లు విష్ణు ఆఫీసు వద్ద ఉన్నాయంటూ అతను ఆరోపించారు.. జల్లిపల్లి లో తన ఇంట్లో 150 మంది చొరబడి మరి ఈ విధ్వంసం చేశారంటూ ఈ ఘటన తను ఇంటి దగ్గర లేకపోయినప్పుడు జరిగింది అంటూ మనోజ్ వెల్లడించారు. తన సోదరుడు విష్ణు నే ఈ పని చేయించి ఉంటారని నా ఇంటి నుంచి దొంగలించినటువంటి ఆ వస్తువులను కార్లను కూడా తన ఆఫీసులోనే ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉందని ఫిర్యాదులో తెలియజేశారట. ఈ విషయాల గురించి తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు మనోజ్ కూడా ప్రయత్నించినట్లు వెల్లడించారు. కానీ ఆయన మాత్రం తనతో మాట్లాడేందుకు అంగీకరించలేదని మనో తెలియజేశారట. తన కుటుంబానికి రక్షణ కల్పించి దోషులను శిక్షించాలంటూ తెలియజేశారట మనోజ్.