
70 ఏళ్ల వయసులో అన్నపూర్ణ యాక్టివ్గా కనిపిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నది. సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న అన్నపూర్ణ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలను తెలియజేసింది. అలాగే తన కుటుంబ విషయాలను సినిమాల గురించి మాట్లాడుతూ వర్ష అడిగిన ప్రశ్నలకు సైతం సమాధానాలను తెలియజేసింది అన్నపూర్ణ. ఇండస్ట్రీలో హీరోయిన్ల కమిట్మెంట్స్ గురించి మాట్లాడుతూ దీనిపైన మీటు ఉద్యమం కూడా జరిగింది.. దీనిపైన మీ సమాధానం ఏంటి అంటే జబర్దస్త్ వర్ష అన్నపూర్ణను ప్రశ్నించడం జరిగింది.
అయితే ఇప్పుడు ఉన్న కాలంలో కమిట్మెంట్లతోనే నటిమనలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనే విషయం నిజమే అవ్వచ్చు కానీ సదురు నటి మనులు కూడా ఇష్టం లేకుండానే ఎవరు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే కనిపించడం లేదని కమిట్మెంట్లకు మేము ఒప్పుకోమని మొహం మీద చెప్పేస్తే ఎవరూ ఏమీ చేయలేరు.. ఇలాంటి గట్టి నిర్ణయాలు తీసుకుంటే ఈ కమిట్మెంట్ గోల పూర్తిగా తగ్గిపోతుందని.. కానీ తమకు ఇష్టంగా కమిట్మెంట్లకు ఓకే అని చెప్పడంతోనే ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుందంటూ తెలిపింది. చాలామంది అవగాహన లేకనే కమిట్మెంట్లు ఒప్పుకుంటున్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినట్టు కాదగా అన్నట్టుగా తన అభిప్రాయమని వెల్లడించింది అన్నపూర్ణ.. ఇక తాము నటించే సమయాలలో ఇలా తుప్పట్లోకి ఎవరు వెళ్లడాలు లేవని.. కేవలం తమకు నచ్చితే ఆ వ్యక్తితో మాత్రమే కలిసి తిరిగేవారని అది కూడా ప్యూర్ గా ఉండేదని తెలిపారు. ఇక కమిట్మెంట్లకు సైతం నో చెబితేనే సరైన పరిష్కారమని ఎవరు కూడా తమని బలవంతంగా లాక్కెళ్ళే పరిస్థితి అయితే ఉండదు కదా అంటూ వెల్లడించింది.