
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో కీర్తి భట్ ఒకరు. బిగ్ బాస్ షో ద్వారా ఈమెకు ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్న కీర్తి భట్ తాజాగా ఒక సందర్భంలో చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. నా పని నేను చేసుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి నా వెనుక పడ్డాడని కీర్తి భట్ చెప్పుకొచ్చారు. ఒకే సెట్ లో ఉండటంతో అతని ప్రేమకు నేను ఓకే చెప్పానని ఆమె కామెంట్లు చేశారు.
నేను తన ఇంటికి కూడా వెళ్లేదానినని ఆ తర్వాత అతని అనుమానపు బుద్ధి బయటపడిందని ఆమె చెప్పుకొచ్చారు. నేను చేస్తున్న సీరియల్ హీరోతో కలిసి ఏదైనా షోకు వెళ్లడానికి అతను అంగీకరించేవాడు కాదని కీర్తి భట్ పేర్కొన్నారు. ఒకవేళ వెళ్తే నాకు అతనికి ఏదో ఎఫైర్ ఉందని భావించేవాడని ఆమె చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీ అంటే అందరితో కలిసి మెలిసి ఉండాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
హీరో హీరోయిన్ అన్నాక షోకు వెళ్లాలని కలిసి డ్యాన్స్ చేయాలని ఆమె చెప్పుకొచ్చారు. నేను ఏదీ చేయకూడదని ఆంక్షలు పెట్టేవాడని నేను ఎక్కడికి వెళ్లినా అతడు, అతని తల్లి డౌట్ పడేవారని కీర్తి భట్ వెల్లడించారు. ఇదేంటి నరకంలో పడిపోయానని అనిపించిందని నేను దాచుకున్న డబ్బంతా వాళ్లకే ఖర్చు చేసేవాడినని ఆమె చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ కు వెళ్లకముందే నా లవ్ బ్రేకప్ అయిందని కీర్తి అన్నారు.
అదే సమయంలో నేను దత్తత తీసుకున్న పాప కూడా చనిపోయిందని ఆమె చెప్పుకొచ్చారు. ఆ పాప నా కూతురే కావచ్చని డీ.ఎన్.ఏ టెస్ట్ కూడా చేయించాలని ప్రయత్నించారని ఆమె తెలిపారు. నాపై విషం కక్కిన ఆ వ్యక్తి లైఫ్ లో ఎదగకుండా అక్కడే ఆగిపోయాడని కీర్తి భట్ కామెంట్లు చేశారు. కీర్తి భట్ వెల్లడించిన విషయాలు హట్ టాపిక్ అవుతుండగా ఆమె కెరీర్ పరంగా ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.