
చిరంజీవి బాబీ కాంబో సినిమాను, బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీని సైతం ఈ నిర్మాత నిర్మించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. వైరల్ అవుతున్న వార్త నిజమైతే మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో వృద్ధి సినిమాస్ కు తిరుగుండదని చెప్పవచ్చు. సీనియర్ హీరోలతో వరుస సినిమాలు ప్లాన్ చేయడం అంటే సాధారణ విషయం కాదనే చెప్పాలి.
వృద్ధి సినిమాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్5 బ్యానర్లలో ఒకటిగా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఈ బ్యానర్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రస్తుతం నిర్మాతల కొరత వేధిస్తోంది. సతీష్ కిలారు ఎంట్రీతో ఆ లోటు కొంతమేర తీరినట్టేనని కచ్చితంగా చెప్పవచ్చు.
టాలీవుడ్ ఇండస్ట్రీకి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. టాలీవుడ్ హీరోలు ఎంచుకుంటున్న ప్రాజెక్ట్స్ సైతం భారీ స్థాయిలో ఉన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి 2025 అన్ని విధాలుగా కలిసిరావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పెద్ది, బన్నీ అట్లీ కాంబో మూవీ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లతో తెరకెక్కనున్నాయని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. వృద్ధి సినిమాస్ ప్రధానంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెడుతుండటం గమనార్హం. రాబోయే రోజుల్లో ఈ బ్యానర్ రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. పెద్ది సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం పక్కా అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.