
ఈ మధ్యకాలంలో థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కన్నా.. రీరిలీజ్ అయ్యే సినిమాలే ఎక్కువ ఉన్నాయి. హిట్ తో సంబంధం లేకుండా మంచి టాక్ ని సొంతం చేసుకున్న సినిమాలు సైతం మరోసారి రీరిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే హిట్ కొట్టిన మురారి, ఇంద్ర, గబ్బర్ సింగ్, భద్రి, హ్యాపీ డేస్ సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. అలాగే వాటితో పాటుగా ఫ్లాప్ అయిన సినిమాలు.. హీరో సిద్దార్థ్, బేబీ శ్యామలి తెరకెక్కించిన లవ్ స్టోరీ ఓయ్, రామ్ చరణ్ నటించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ ఆరెంజ్ సినిమాలు రీరిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తో పాటు కలక్షన్స్ కూడా బాగానే సొంతం చేసుకున్నాయి.
ఐకన్ స్టార్ అల్లు అర్జున్, అనుష్క నటించిన వేదం, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నేనొక్కడినే, ఖలేజా సినిమాలు, అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సాహో, గోపీచంద్ గౌతమ్ నంద, జూనియర్ నందమూరి తారక రామరావ్ నటించిన ఊసరవెల్లి, రామ్ నటించిన జగడం సినిమా, హీరో అక్కినేని నాగచైతన్య తెరకెక్కించిన జోష్ సినిమాలు కూడా ఫ్లాప్ అయినప్పటికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాయి. కొత్త సినిమాలతో సమానంగా రీరిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలో త్వరలో మరికొన్ని సినిమాలు రీరిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. ఇక ఇలా కంటెంట్ ఉన్న మూవీస్ ని రీరిలీజ్ చేయడం మూవీ లవర్స్ కు పండగే పండగ అనే చెప్పాల్సిందే. ఎందుకంటే అవి అన్నీ మంచి ఫీల్ గుడ్ మూవీస్ అని చెప్పవచ్చు.