
ఈసినిమా రావడానికి ముందు అప్పటికే సక్సస్ ఫుల్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న రాజమౌళి సక్సస్ ఫుల్ మంత్ర పేరుతో ఒక సక్సస్ ఫుల్ సినిమాని ఎలా తీయాలి అన్న విషయాన్ని వివరిస్తూ ఒక పుస్తకం వ్రాయాలి అనుకుని భావించాడట. అయితే ‘బిజినెస్ మ్యాన్’ విడుదల అయిన తరువాత రాజమౌళి ఈ పుస్తకాన్ని వ్రాసే ఆలోచన విరమించుకున్నాడట.
దీనికి కారణం సక్సస్ ఫుల్ సినిమాలో హీరోకి ఉండవలసిన లక్షణాలు ఏమీ లేకుండా ‘బిజినెస్ మ్యాన్’ మూవీలో మహేష్ పాత్ర నెగిటివ్ గా ఉండటమేకాకుండా చివరకు హీరో నోటివెంట బూతు డైలాగ్స్ వచ్చినప్పటికీ ప్రేక్షకులు ఎంజాయ్ చేయడంతో హీరో పాత్రకు పలాన లక్షణాలు ఉండాలి అన్న తన ఆలోచన మారిపోయిందని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడట. అంతేకాదు ఆరోజు నుండే తాను మహేష్ తో ఒక సినిమాను తీయాలని భావించుకున్న విషయాన్ని కూడ జక్కన్న వివరించాడు.
ఆ స్పూర్తి కొనసాగుతూ ఉండటంతో మహేష్ రాజమౌళిల పాన్ వరల్డ్ మూవీ 1000 కోట్ల బడ్జెట్ తో ఇప్పుడు నిర్మాణంలో ఉందని భావించాలి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో కూడ మహేష్ పాత్ర కొంత నెగిటివ్ టచ్ లో డిఫరెంట్ బాడీ ల్యాంగ్వేజ్ తో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలే నిజం అయితే రాజమౌళి పై పూరీ ‘బిజినెస్ మ్యాన్’ చాల ప్రభావమే చూపించింది అనుకోవాలి. అలాంటి సంచలనాలు సృష్టించిన పూరీ ఇప్పుడు ఎందుకు సక్సస్ ఫుల్ సినిమాలు తీయలేకపోతున్నాడు అన్నది అర్థంకాని విషయం..