సోషల్ మీడియాలో ఫన్నీ ఫన్నీ మీమ్‌స్ ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. కొన్ని ఆహ్లాదకరంగా ఉంటే కొన్ని హర్టింగ్గా ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అయిన మీమ్‌స్ ఎవరి గురించైనా ఉన్నాయి అంటే మాత్రం అది కచ్చితంగా మహేష్ బాబు - రాజమౌళి సినిమా గురించి అని చెప్పాలి . రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాకి సంబంధించి చాలా పక్కాగా ముందుకు వెళ్తున్నాడు రాజమౌళి . ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు . అందుకే సినిమాకి సంబంధించి ఏ ఒక్క విషయాన్ని కూడా బయట పెట్టడం లేదు . కానీ కొన్ని సీన్స్ మాత్రం లీక్ అయిపోతున్నాయి. అవి వైరల్ అయిపోతున్నాయి.


కాగా ఇప్పుడు మహేష్ బాబు పాస్ పోర్ట్ తిరిగిచ్చేసాడు రాజమౌళి అంటూ ఫన్నీ మీమ్‌స్ ట్రెండ్ చేస్తున్నారు జనాలు . మహేష్ బాబు ఎక్కువగా వెకేషన్ కి వెళ్తూ ఉంటాడు . ఆ కారణంగానే రాజమౌళి - మహేష్ బాబు పాస్ పోర్ట్ లాగేసుకుంటున్నట్లు ఒక ఫన్నీ వీడియోని రిలీజ్ చేశారు . ఆ వీడియో పై ఎన్ని మీమ్స్ వైరల్ అయ్యాయో అందరికి తెలిసిందే . రీసెంట్గా మహేష్ బాబుకి పాస్ పోర్ట్ తిరిగిచ్చేసాడు రాజమౌళి.  దాని గురించి కూడా ఫన్నీ మీమ్‌స్ వచ్చాయి . అయితే మహేష్ బాబుకి పాస్ పోర్ట్ ఓ  కండిషన్ మీద తిరిగి ఇచ్చాడు రాజమౌళి అంటూ జనాలు కామెడీగా మాట్లాడుకుంటున్నారు .



కాల్ షీట్స్ మూడు సంవత్సరాలు తీసుకున్న రాజమౌళి ఎప్పుడు వెకేషన్ కి వెళ్ళినా సరే ఇంకొక ఆరు నెలలు ఎక్స్ట్రా కాల్ షీట్స్ ఛార్జ్ చేసే విధంగా డీల్ మాట్లాడుకుని ఉంటారు అని.. అందుకే మహేష్ బాబు ఇక ఈ రాజమౌళి తో వేగలేము అంటూ ఆయన కండిషన్ కి ఓకే చెప్పి మరి పాస్ పోర్ట్ బ్యాక్ తీసుకున్నాడు అని మాట్లాడుకుంటున్నారు. మహేష్ బాబుకి వెకేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని ..సరదాగా మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబుకు సంబంధించిన ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది.  త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ వస్తుంది అంటూ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.  కానీ అది ఎప్పుడు వస్తుందో ..? ఎలా ఇస్తారు ..? అనేది అందరికీ బిగ్ టెన్షన్ గానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: