
అలాంటి రాశి విలన్ షేడ్స్ లో కనిపిస్తుంది అని ఎవరు ఊహించలేకపోయారు. వామ్మో రాశి ఏంటి నెగిటివ్ షేడ్స్ లో ఉంది అంటూ షాక్ అయిపోయారు. ఆ సినిమా మరేంటో కాదు నిజం . మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో రాశిలో విలన్ షేడ్స్ లో కనిపిస్తుంది . కాగా ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది . రాశి పర్ఫామెన్స్ జనాలకు పెద్దగా నచ్చలేదు. ఫ్యాన్స్ కూడా మండిపడ్డారు . బూతులు తిట్టారు. అయితే మహేష్ బాబుకి విలన్ గా నటించిన ఇదే రాశి.. గతంలో పవన్ కళ్యాణ్ కి జోడిగా గోకులంలో సీత అనే సినిమాలో నటించి మెప్పించింది.
పవన్ కళ్యాణ్ కెరియర్ లో గోకులంలో సీత చాలా ఢిఫరెంట్. ఈ సినిమాలో రాశి క్యారెక్టర్ స్పెషల్ . అలాంటి క్యారెక్టర్ మళ్లీ రాశీ లైఫ్ లో చేయదు చేయలేదు అని చెప్పుకోవడంలో సందేహమే లేదు. అలా పవన్ కళ్యాణ్ కి హీరోయిన్గా నటించిన హీరోయిన్ రాశి మహేష్ బాబుకు మాత్రం విలన్ గా నటించి ఫ్లాప్ తన ఖాతాలో వేసుకుంది . ప్రజెంట్ రాశి తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . పలు సీరియల్స్ లో నటించింది . ఇప్పుడు అడపా దడప్ప వచ్చిన అవకాశాలలో సినిమాలలో కూడా కనిపించబోతుంది..!!