సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉంటుంది . ఒకప్పుడు హీరోయిన్గా నటించిన వాళ్లు ఆ తర్వాత అమ్మగా ఆ తర్వాత వదినగా ఆ తర్వాత అమ్మమ్మగా కూడా నటించే విధంగా సిచువేషన్స్ మారిపోతూ వస్తున్నాయి .మరీ ముఖ్యంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి . ఆ హీరోయిన్ మరెవరో కాదు సింధుతులాని.  హీరోయిన్గా తనకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించుకోవడానికి చాలా చాలా ట్రై చేస్తుంది . కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో తన కెరియర్ ని టర్న్ చేసుకుంది .


అమ్మ పాత్రలో వదిన పాత్రల్లో నటిస్తూ తన లైఫ్ ని ముందుకు తీసుకెళ్లాలి అంటూ భావించింది . అది కూడా వర్క్ అవుట్ అవ్వలేదు. కాగా ఇప్పుడు సింధుతులానికి సంబంధించిన ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. గతంలో సింధుతులాని కళ్యాణ్ రామ్ తో అతనొక్కడే సినిమాలో హీరోయిన్గా నటించింది.  ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్  గా కనిపించింది. కానీ ఏవి ఆమెకు పెద్ద సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అయితే ప్రభాస్ సరసన నటిస్తుంది సింధుతులాని అని తెలిసినప్పుడు ఆమె కెరియర్ లో హిట్ పడుతుంది అని అంతా అనుకున్నారు.



కానీ అసలు ఆమె కెరియర్ లోనే బిగ్ డిజాస్టర్ గా మారిపోయింది ఆ మూవీ . ఆ సినిమా మరేంటో కాదు "పౌర్ణమి".  త్రిష -ఛార్మి హీరోయిన్లుగా కనిపించిన ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో మెరుస్తుంది సింధుతులాని . ప్రభాస్ కి మరదలు క్యారెక్టర్ లో  కనిపించింది . కాసేపు అయినా పవర్ఫుల్ పాత్ర అది.  కానీ ఆమె కెరియర్ మాత్రం మార్చలేకపోయింది.  ప్రభాస్ కి మరదలుగా నటించిన సింధు తులానీ అల్లు అర్జున్ కి మాత్రం సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో వదిన క్యారెక్టర్ లో నటించి మెప్పించింది . మరదలు క్యారెక్టర్ లో ఏ పర్ఫామెన్స్ అయితే ఇచ్చిందో వదిన క్యారెక్టర్ లో కూడా అదే పెర్ఫార్మన్స్ ఇచ్చింది సింధుతులాని.  కానీ హిట్టు మాత్రం అందుకోలేకపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: