టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా పేరు పొందిన కమెడియన్ సప్తగిరి కామెడీ టైమింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కమెడియన్ నుంచి హీరోగా పలు చిత్రాలలో నటించిన సక్సెస్ కాలేకపోయారు. దీంతో అవకాశాలు కూడా నెమ్మదిగా కనుమరుగయ్యాయి. ఆ తర్వాత పొలిటికల్ పరంగా కూడా టిడిపి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎమ్మెల్యే సీటు ఆశించినప్పటికీ అందుకోలేకపోయారు సప్తగిరి.. తాజాగా కమెడియన్ సప్తగిరి ఇంట తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నట్లు తెలుస్తోంది. సప్తగిరి తల్లి చిట్టెమ్మ గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ చికిత్స తీసుకుంటోందట. అయితే నిన్నటి రోజున సప్తగిరి తల్లి చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచింది.


ఈ రోజున సప్తగిరి తల్లి చిట్టెమ్మ అంత్యక్రియలు తిరుపతిలోని పద్మాపురంలో జరగబోతున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ విషయం తెలిసిన పలువురు అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఈమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ కోరుకుంటున్నారు. కమెడియన్ సప్తగిరి కి కూడా తన తల్లి అంటే చాలా ఇష్టమని కానీ తన తల్లి మరణ వార్త విని తీవ్ర దిగ్డానికి గురయ్యారు. కమెడియన్ సప్తగిరి తన కామిడీ టైమింగ్ తో మంచి పేరు సంపాదించిన సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. ఇటీవలే తాను నటించిన  పెళ్లి కాని ప్రసాద్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది.


కమెడియన్ గా ఎన్నో చిత్రాలలో నటించిన సప్తగిరి ఎక్కువగా కామిడీనే నమ్ముకొని పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. సప్తగిరి ఎన్నో చిత్రాలలో కూడా సెంటిమెంటుతో అదరగొట్టేశారు. మరి రాబోయే రోజుల్లో  వరుస సినిమాలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ చిత్రంలో కూడా నటిస్తూ ఉన్నారు. పలు రకాల ఇంటర్వ్యూలలో కూడా ప్రభాస్ సినిమా గురించి తెలియజేస్తూ బాగానే హైప్ పెంచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: