
PBKS (పంజాబ్ కింగ్స్) - CSK (చెన్నై సూపర్ కింగ్స్) మ్యాచ్ లో భాగంగా ధోనీ ఆటపై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తి కరమైన పోస్ట్ పెట్టడం జరిగింది. థమన్ ఈ సందర్భంగా తన పోస్టులో.. "దిగ్గజ ఆటగాడైనటువంటి ధోనీపై మొరుగుతున్న కుక్కలన్నీ నేడు అతని ప్రతిభావంతమైన ఆటని చూసి కుళ్లుకొని ఉంటాయి!" అని రాసుకొచ్చాడు. దాంతో ఆ పోస్టుకింద భారీగా విమర్శలు రావడంతో వాటికి ధీటుగా మరో పోస్టు పెడుతూ... "ఇది చెన్నై సూపర్ కింగ్స్ గెలుపుకోసం ఎంతమాత్రమూ కాదు. ఎన్నో సిరీస్ లు గెలిపించి దేశానికి త్యాగం చేసిన మనిషి గురించి... ఈరోజు మాతోపాటు ఆ ట్రోఫీలు కూడా ఉన్నాయంటే ఆ ఒక్కడి వలెనే సాధ్యమైంది!" అని రాసుకొచ్చారు. దాంతో విమర్శకుల నోళ్లు మూయించినట్టయింది.
ఇకపోతే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 26 బంతులు ఆడిన ధోనీ ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 30 పరుగులతో నాటౌట్‌గా నిల్చిన సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలో అదే మ్యాచ్‌కి కామెంటేటర్‌గా వ్యవహరించిన సీఎస్కే మాజీ ఆటగాడు ధోనీని ఉద్దేశించి, అభ్యంతకరమైన కామెంట్స్ చేశాడు. ఇప్పటికైనా ధోనీ గ్రహించాలని, లేకపోతే సీఎస్కేకే ప్రమాదం అంటూ సూచనలు చేయడం జరిగింది. చెపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 25 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. 74 పరుగులకే సీఎస్కే ఐదు కీలక వికెట్లు కోల్పోగా.. విజయ్ శంకర్, ఎంఎస్ ధోనీ ఆఖరి వరకూ క్రీజులోనే కొనసాగారు. అయినప్పటికీ సీఎస్కేకి ఓటమిపాలవ్వక తప్పలేదు. అయితే, ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ ఆటతీరును చూసి సీఎస్కే మాజీ ప్లేయర్, ధోనీ సహచర ఆటగాడు మాథ్యూ హేడెన్ చురకలు అంటించాడు.