టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్న వారిలో రామ్ చరణ్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే రామ్ చరణ్ హీరోగా రూపొందిన సినిమాలకు చాలా వరకు పెద్ద ఎత్తున బిజినెస్ లు జరుగుతూ ఉంటాయి. ఇక చరణ్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో చాలా సినిమాల మ్యూజిక్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి.

ఇది ఇలా ఉంటే చరణ్ కొన్ని రోజుల క్రితం ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా హీరోగా నటించాడు. రాజమౌళిమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ యొక్క మ్యూజిక్ హక్కులు 26 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఇక చరణ్ ఆఖరుగా గేమ్ చేంజర్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

కానీ ఈ మూవీ యొక్క మ్యూజిక్ హక్కులు మాత్రం 23 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ "పెద్ది" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ యొక్క మ్యూజిక్ హక్కులు ఏకంగా 25 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఇంకో కోటి కంటే ఎక్కువ బిజినెస్ పెద్ది సినిమా మ్యూజిక్ హక్కులకు జరిగి ఉంటే ఈ మూవీ ఆర్ ఆర్ ఆర్ రికార్డును దాటేది.  అలా జస్ట్ లో చరణ్ ఓ సరికొత్త రికార్డును మిస్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: