
పెద్ది : టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లీమ్స్ వీడియోను విడుదల చేశారు. ఈ మూవీ గ్లిమ్స్ వీడియో కి విడుదల అయిన 24 గంటల్లో 31.15 మిలియన్ వ్యూస్ దక్కాయి.
దేవర పార్ట్ 1: జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందిన ఈ సినిమా యొక్క గ్లీమ్స్ వీడియోకు 24 గంటల్లో 26.17 మిలియన్ వ్యూస్ దక్కాయి. జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.
గుంటూరు కారం : మహేష్ బాబు హీరో గా రూపొందిన ఈ మూవీ గ్లీమ్స్ వీడియోకు విడుదల 24 గంటల్లో 20.98 మిలియన్ వ్యూస్ దక్కాయి.
పుష్ప పార్ట్ 2 : అల్లు అర్జున్ హీరో గా రూపొందిన ఈ మూవీ గ్లీమ్స్ వీడియోకు విడుదల అయిన 24 గంటల్లో 20.45 మిలియన్ వ్యూస్ దక్కాయి.
ది పారడైజ్ : నాని హీరో గా రూపొందిన ఈ మూవీ గ్లీమ్స్ వీడియో విడుదల అయిన 24 గంటల్లో 17.14 మిలియన్ న్యూస్ దక్కాయి.
లైగర్ : విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన ఈ మూవీ గ్లీమ్స్ వీడియోకు విడుదల అయిన 24 గంటల్లో 15.92 మిలియన్ వ్యూస్ దక్కాయి.