
గతం లో జనవరి 9 న మేకర్స్ ఈ సినిమా ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే .. కానీ ఇప్పుడు కొత్త డేట్ ని మేకర్స్ నేడు అనౌన్స్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది .. ఇక మరి ఆ అప్డేట్ కోసమే లేక మరేమన్నా అనేది ఈ మధ్యాహ్నం తేలిపోనుంది . ఇప్పటి కే ఎన్టీఆర్ దేవర విజయం తో ఫుల్ ఫార్మ్ లో ఉన్నాడు . ఇక ఈ సినిమా కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది. కేజీయఫ్, సలార్ తరహాలో సాగనుంది. ఇక ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇక ఫస్ట్ షెడ్యూల్‌ని ఎన్టీఆర్ లేకుండానే మొదలు పెట్టాడు ప్రశాంత్. సెకండ్ షెడ్యూల్‌ని వికారాబాద్ అడవుల్లో ప్లాన్ చేశాడట.
మార్చిలో జరిగిన ఈ షెడ్యూల్ ఎన్టీఆర్ పాల్గొన్నట్టు సమాచారం. ఈ సినిమాలో సప్త సాగరాలు ఫేం, కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా రూపొందనున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. ఇదే క్రమంలో బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 చేస్తున్నాడు .. అలాగే ప్రశాంత్ నీల్ కూడా ఎప్టీఆర్ తో చేయబోయే సినిమా షూటింగ్ కూడా రీసెంట్ గానే మొదలు పెట్టారు .. ఇలా వరుస జోష్లో ఉన్న ఎన్టీఆర్ .. ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేయడాని కి సిద్ధమవుతున్నాడు .