
ఇందులో భాగంగా అకీరా నందన్ మూవీ లాంచింగ్‌పై ఆమె స్పందించారు. అకీరా నందన్‌ని రామ్‌చరణ్ ప్రొడ్యూస్ చేస్తే మీ రియాక్షన్ ఏంటి? అని యాంకర్ అడగ్గా.. అంతకంటే సంతోషం ఇంకేముంది? అకిరాని తన అన్న మెగా పవర్ స్టార్ లాంచ్ చేస్తే నాకన్నా సంతోసించేవాళ్ళు ఎవరూ ఉండరు! అని చెప్పుకొచ్చారు. అదే సమయంలో రామ్ చరణ్ చేతుల మీద డెబ్యూ ఇవ్వడం లేదని, అవన్నీ ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ అది జరిగితే బావుంటుంది అని అన్నారు. అదేవిధంగా అకీరా ఓజీలో నటించడం లేదని, ఆ వార్తల్ని తన దగ్గరి వాళ్లు కూడా షేర్ చేసి మరీ అడుగుతున్నారని ఈ సందర్భంగా రేణు దేశాయ్ అన్నారు.
ఇకపోతే రేణుదేశాయ్ ఎక్కడికి వెళ్లినా అకీరా ఎంట్రీ గురించే ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. ఇటీవల రాజమహేంద్రవరం వెళ్లిన ఆమెను విలేకర్లు ఇదే ప్రశ్న అడగ్గా... తన తనయుడి ఎంట్రీ కోసం తాను కూడా ఆశగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘నేను ఎక్కడికి వెళ్లినా నాకు ఎదురయ్యే ప్రశ్న అకీరా ఎంట్రీ గురించే. అందరి కంటే ఎక్కువగా ఒక తల్లిగా నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా. కాకపోతే అది పూర్తిగా అతడి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అకీరా ఎప్పుడు అప్పుడు అనుకుంటే అప్పుడు సినిమాల్లోకి వస్తాడు!’’ అని చెప్పుకొచ్చారు.