చాలా సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ "ఆర్య 2" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... నవదీప్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... శ్రద్ధదాస్ , బ్రహ్మానందం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున కలెక్షన్లు దక్కలేదు. దానితో ఈ సినిమా ఆ సమయంలో యావరేజ్ వసూళ్లను మాత్రమే రాబట్టగలిగింది. ఇకపోతే ఆ సమయంలో యావరేజ్ కలెక్షన్లను రాబట్టి మామూలు విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తాజాగా థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. రెండు రోజుల్లో ఆర్య 2 మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

రెండు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 2.25 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 45 లక్షలు , ఆంధ్ర లో 1.75 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో కలిపి ఈ మూవీ కి 4.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక రెండు రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లలో కలుపుకొని 75 లక్షల కలెక్షన్లు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి రెండు రోజుల్లో 5.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇలా ఈ మూవీ రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లను రీ రిలీజ్ లో భాగంగా వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa