టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులలో నాని ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో హీరోగా నటించి ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో నాని వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. నాని కెరీర్ లో దసరా సినిమా మొదటి పాన్ ఇండియా సినిమాగా విడుదల అయింది. ఈ మూవీ మంచి సక్సెస్ను అందుకుంది. ఆ తర్వాత నాని హీరోగా రూపొందిన హాయ్ నాన్న , సరిపోదా శనివారం సినిమాలు కూడా పాన్ ఇండియా మూవీలుగా విడుదల అయ్యి మంచి సక్సెస్లను అందుకున్నాయి.

దానితో నానికి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ప్రస్తుతం నాని , శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్ , హిట్ ది సెకండ్ కేస్ మూవీలు మంచి విజయాలు సాధించడంతో హిట్ ది థర్డ్ కేస్ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ని మరి కొంత కాలం లోనే విడుదల చేయనున్నారు.

హిట్ 3 సినిమాకి సంబంధించిన కేరళ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఈ మూవీ బృందం అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కేరళ డిస్ట్రిబ్యూషన్ హక్కులను వే ఫరెర్ ఫిలిం సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమాను కేరళలో భారీ ఎత్తున విడుదల చేయడానికి ఇప్పటి నుండే సన్నాహాలను కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ఇకపోతే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: