తెలుగు ప్రముఖ కమెడియన్స్ లో వెన్నెల కిషోర్ కూడా ఒకరు .. తనదై న మార్క్‌ కామెడీ తో యూనిక్‌ టైమింగ్ తో ఎన్నో సినిమాల్ల విజయం లో కీలక పాత్ర కూడా పోషించాడు వెన్నెల కిషోర్ ..  ప్రస్తుతం ఈ అగ్ర కమెడియన్ హీరో గా కూడా పలు సినిమాలు వస్తున్నాయి .. శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్ , చారి 111 వంటి సినిమా ల్లో హీరో గా నటించి మెప్పించాడు .. అలాగే బ్రహ్మానందం తర్వాత ఆ రేంజ్ బిజీ కమెడియన్ గా క్రెజ్‌ తెచ్చుకున్న ఏకైక నటుడు కూడా వెన్నెల కిషోర్ అని చెప్పవచ్చు .
 

అయితే కిషోర్ కు వెన్నెల కిషోర్ అనే టాగ్ ఎలా వచ్చింది అనే సంగతి చాలామందికి పెద్దగా తెలియదు .. ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేసుకుంటూ ఉండే కిషోర్ దర్శకుడు దేవకట్ట డైరెక్ట్ చేసిన వెన్నెల సినిమా తో  చిత్ర పరిశ్రమ లో అడుగుపెట్టాడు .  అయితే అందరూ వెన్నెల సినిమా హిట్ అవడం తో ఆ పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్నాడ ని అంత అనుకుంటారు .. కానీ అసలు విషయం ఏంటో స్వయం గా కిషోర్‌ చెప్పకొచ్చాడు .  


కెరియర్ మొదట్లో ఓ సినిమా లో నటిస్తున్న సమయం లో కిషోర్ కు పంపాల్సిన ప్రొడక్షన్ కారు ను అదే పేరు తో ఉన్న మరో కిషోర్ కు పంపారట .. దాంతో ఆ మేనేజర్ ఇంకోసారి అలా జరగకుండా ఉండేందు కు కిషోర్ తో మిమ్మల్ని వెన్నెల కిషోర్ అని పిల‌వచ్చా అని అడుగుడం తో అందుకు ఆయన ఓకే అన్నారట .. ఇక‌ అప్పటినుంచి కిషోర్ కాస్త వెన్నెల కిషోర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమా లో నటించి అగ్ర కమెడియన్ గా ఇప్పటికీ ఇండస్ట్రీ లో కొనసాగుతున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: