
తన తండ్రిని కలిసి తాను మాట్లాడాలని మనోజ్ గేటు బయటే వాదిస్తూ.. నిరాహార దీక్ష చేస్తూ కూర్చున్నట్లుగా వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మనోజ్ వస్తున్నాడని సమాచారం పోలీసులకు తెలియడంతో పెద్ద ఎత్తున మోహన్ బాబు ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా సుమారుగా 100 మంది పోలీసులు కూడా మోహరించినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు ఇంటి పరిసర ప్రాంతాలలో కూడా పోలీసులు సైతం పలు రకాల ఆంక్షలు విధిస్తూ బయట వ్యక్తులను కూడా లోపలికి అనుమతించడం లేదట.
మనోజ్ కూడా ఇప్పటికే తన కారు ఇంటిలోని వస్తువులను సైతం ఎవరో దొంగలించారంటూ నార్సింగ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మనోజ్ తెలిపిన ప్రకారం తాను ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లో ఏప్రిల్ ఒకటవ తేదీన మంచు మనో జ్ చెందిన ఒక కారును తన ఇంటి ముందు నిలిపారని రాత్రి 11 గంటల సమయంలో తన డ్రైవర్ భోజనం చేస్తూ ఉండగా కారు స్టార్ట్ చేస్తున్న శబ్దం వినిపించిందని అనుమానంతో బయటికి వచ్చి చూడగా తన కారును ఆపకుండా అతివేగంగా కొంతమంది దొంగలు ఊడయించారంటూ మనోజ్ తెలిపారు. దీంతో వెంటనే నార్సింగ్ పోలీసులకు కూడా తన ఫిర్యాదు చేశానని తెలియజేశారు. పోలీసులు కూడా అన్ని కోణాలలో పరిశీలిస్తూ ఉన్నారు.