తమిళ నటుడు అజిత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఈయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని మూవీలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఉంది. 

ఇకపోతే ఆఖరుగా అజిత్ కుమార్ "విడ మూయర్చి" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని తెలుగులో పట్టుదల అనే పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ తమిళ్ లో పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. తెలుగులో మాత్రం ఈ సినిమా బోల్తా కొట్టింది. తాజాగా అజిత్ కుమార్ "గుడ్ బ్యాడ్ అగ్లీ" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని రేపు అనగా ఏప్రిల్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. 

ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. ఈ మూవీ టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ కు చెన్నై సిటీలో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కేవలం ఒక చెన్నై లోనే 84 శాతం ఆక్యుఫెన్సీ తో ఈ మూవీ కి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇలా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కి చెన్నై నగరంలో అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు మార్క్ ఆంటోనీ మూవీ తో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ak