ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో శంకర్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభం నుండి విజయాలను అందుకుంటూ ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం శంకర్ తన కెరియర్ బిగినింగ్ లో ఏ రేంజ్ విజయాలను అందుకున్నాడు ఆ స్థాయి విజయాలను అందుకోవడంలో అత్యంత వెనుకబడిపోయాడు. ఇకపోతే తమిళ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లు ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో అట్లీ ఒకరు. కెరియర్ బిగినింగ్ నుండి కూడా అట్లీ , శంకర్ తరహా సినిమాలను రూపొందిస్తూ అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అవుతూ వస్తున్నాడు.

ఈయన ఇప్పటివరకు ఐదు సినిమాలను రూపొందిస్తే ఆ ఐదు సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇకపోతే శంకర్ కెరియర్ ప్రారంభంలో మొదట ప్రేమ కథ చిత్రాలను రూపొందించి ఆ తర్వాత సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలను రూపొందించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత రోబో లాంటి గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ మూవీ ని రూపొందించి అందులో కూడా శంకర్ అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయ్యాడు. ఇక అట్లీ కూడా దాదాపు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.

అట్లీ తన కెరీర్లో మొదటి సినిమాగా రాజా రాణి అనే ప్రేమ కథ సినిమాను రూపొందించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వరుస పెట్టి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలను రూపొందించి విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన తన తదుపరి మూవీ ని అల్లు అర్జున్ తో చేయనున్నాడు. తాజాగా ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు. దానితో ఈ మూవీ అద్భుతమైన గ్రాఫిక్స్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి యాజ్ టీజ్ శంకర్ ను ఫాలో అవుతున్న అట్లీ , అల్లు అర్జున్ సినిమాతో సక్సెస్ అవుతాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: