తెలుగు సిని మా పరిశ్రమ లో తన కంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న నటులలో అక్కినేని నాగ చైతన్య ఒకరు . ఈయన ఇప్పటి వరకు చాలా సినిమా ల్లో నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని తన కంటూ నటుడిగా ఒక అద్భుతమైన గుర్తింపు ను సంపాదించుకున్నాడు . ఇక పోతే తాజాగా నాగ చైతన్య , చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన తండెల్ అనే సినిమాలో హీరో గా నటించాడు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... బన్నీ వాసు ఈ మూవీ ని నిర్మించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లోని చైతన్య నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే ప్రస్తుతం నాగ చైతన్య విరూపాక్ష సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ కి మేకర్స్ ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ యొక్క షూటింగ్ ను NC 24 అనే వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ పూర్తి చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్ ఒకటి వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ నెల 14 వ తేదీ నుండి 15 రోజుల పాటు ఈ సినిమా యొక్క షూటింగ్ ను మేకర్స్ చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా అన్నపూర్ణ స్టూడియోలో ఒక భారీ సెట్ ను కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

nc