
ఈ సినిమాకు సంబంధించిన సాటిలైట్ హక్కులను సన్ టీవీ సంస్థ వారు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి కొన్ని వారాల థియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమాలో సన్ టీవీ సంస్థ వారు తమ చానల్లో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కొన్ని వారాలు ముగిశాక ఈ మూవీ ని నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఈ మధ్య కాలంలో ఆజిత్ కుమార్ నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నాయి. అయినా కూడా గుడ్ బాడ్ అగ్లీ సినిమాపై తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి తమిళ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.