
ఇక గత కొన్నాళ్లుగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న ప్రీతి జింట . ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టింది .. అలాగే సెలెక్టివ్ గా సినిమాలు కూడా చేస్తుంది .. అందులో భాగంగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ బ్యూటీ మరో భారీ సినిమాలో భాగం కాబోతుందట .. బాలీవుడ్ లో క్రిష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే .. ఇక ఇప్పుడు ఈ సిరీస్ లో భాగంగా త్వరలోనే క్రిష్ 4 కూడా రాబోతుంది .. అలాగే ఈ సినిమాకి హృతిక్ రోషన్ దర్శకత్వం వహిస్తునడం మరో విశేషం ..
కాగా ఈ నాలుగో భాగాన్ని టైం ట్రావెల్ కథాంశం తో దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిచ్చేందుకు సన్న హాలు చేస్తున్నారట .. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హృతిక్ రోషన్ మూడు విభిన్న పాత్రలో కనిపించబోతున్నారని టాక్ కూడా వినిపిస్తుంది . అలాగే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటికే క్రిష్ ఫ్రాంచేజీలో భాగమై మంచి పేరు తెచ్చుకున్న ప్రీతి జింట ఇప్పుడు క్రిష్ 4 లో కూడా నటించబోతుందట .. అలాగే ప్రియాంక చోప్రా, వివేక్ ఓబెరాయ్ , రేఖ వంటి తదితరులు కూడా ఈ నాలుగో భాగంలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది .