
“వివాహం అనేది పూల పాన్పు కాదు.. ఇద్దరి మధ్య సరైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్నప్పుడే ఆ బంధం చక్కగా నిలబడుతుంది. నాకు, చరణ్ కి మధ్య అది చాలా బాగా వర్కవుట్ అయ్యింది. మేము బంధాన్ని మరింత ఉన్నతంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము!” అంటూ తెలిపింది ఉపాసన. ఇక వైవాహిక బంధాన్ని మరింత ఉన్నతంగా మార్చుకోవడానికి ఏదైనా సలహా ఇవ్వమని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అడగగా.. ఆమె రాస్తూ.. “మేమిద్దరం సమస్థాయిల నుండి వచ్చాము. పెళ్లికి ముందే మాకు ఒక అవగాహన ఉంది. మనిషి విలువ, ఆరోగ్యకరమైన బంధాలను కొనసాగించడం, నమ్మకం, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్థిరంగా ఎదుర్కోగలిగే లక్షణం చరణ్ లో బాగా ఉంది. అవన్నీ ఆయనకు తన తండ్రి నుండే వచ్చాయి." అంటూ రాసుకొచ్చింది.
ఇంకా ఆమె ఈ విధంగా పేర్కొంది... "చరణ్ నాతో చాలా చక్కగా ప్రవర్తిస్తాడు. ప్రతి దశలో కూడా నాకు తోడుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తితో కలిసి ఉండటమే నా ఈ విజయ రహస్యం!” అంటూ తన భర్త సపోర్టు గురించి చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె మాట్లాడుతూ... నేను, చరణ్ సమస్యలు ఏదైనా సరే కలిసి కూర్చొని మాట్లాడుకుంటాము. అలా చేస్తేనే బంధం కలకలం నిలబడుతుంది. ప్రతి వివాహ బంధంలో కూడా ఎత్తుపల్లాలు ఉంటాయి. కానీ మీ లక్ష్యాలను మీకు తెలిసినంత కాలం ఒకరికొకరు గౌరవించుకోవాలి... అంటూ ఉపాసన తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. మొత్తానికైతే ఉపాసన చెప్పిన ఈ మాటలు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అనుకోవచ్చు.