
మరి ముఖ్యంగా ఠాగూర్ సినిమాలో ఆమె పర్ఫామెన్స్ హైలెట్ . ఇక నాగార్జున జ్యోతిక మాస్ సినిమా అయితే ఎవర్ గ్రీన్ హిట్ అనే చెప్పాలి. కాగా ఇప్పుడు మరొకసారి తెలుగు ఇండస్ట్రీలో ఆమె మెరవబోతుంది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఒక తెలుగు హీరో తో సినిమాకి ఓకే చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన మరెవరో కాదు అక్కినేని నాగార్జున . యస్..ఆయన తన 100వ సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు. ఆ సినిమాని మెమొరబుల్ గా ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నాడు .
అయితే ఈ సినిమాలో హీరోయిన్లుగా త్రిష - మీనా - మృణాల్ ఠాకూర్ - మీనాక్షి చౌదరి అంటూ రకరకాల హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఫైనల్లీ జ్యోతిక కూడా ఈ సినిమాలో భాగం కాబోతుంది అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది . జ్యోతిక నాగార్జునల కెమిస్ట్రీ అదుర్స్ . చాలా చాలా బాగుంటుంది . తన 100వ సినిమాకి ఎవర్ గ్రీన్ హీరోయిన్ జ్యోతిక అయితే బాగుంటుంది అంటూ నాగార్జున స్పెషల్ గా ఈమె పేరును సజెస్ట్ చేశారట . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే కాంబో గురించి జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . చూడాలి మరి ఇప్పుడు ఈ కాంబో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనేది..???