
విశ్వంభర సినిమాకు సంబంధించి ఓ పాట ఇంకా బ్యాలెన్స్ ఉంది .. అది కూడా ఐటెం సాంగ్ .. ఈ పాటను కీరవాణి ఎప్పుడో సిద్ధం చేశారు అయితే షూటింగ్ చేయలేదు అందుకు కారణం .. ఆ ట్యూన్ చిరంజీవికి పెద్దగా నచ్చలేదన్నట్టు తెలుస్తుంది .. అందుకే ఈ పాటని పక్కన పెట్టి మరో కొత్త ట్యూన్ తో కొత్త పాటని రెడీ చేయమని కూడా చెప్పారట . ఇక కీరవాణి ప్రస్తుతం ఇదే పనుల్లో బిజీగా ఉన్నారని కూడా తెలుస్తుంది .. కీరవాణి ఈ పాట ఇచ్చాక షూటింగ్ మొదలు పెడతారు .. అయితే ఈ పాట లో నటించే హీరోయిన్ ఎవరు అనేది ఇంకా తేలాల్సి ఉంది ..
దర్శకుడు వశిష్ట ప్రస్తుతం ఈ స్పెషల్ సాంగ్లో నటించే హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నారు .. పాటతో పాటు అందులో నటించే హీరోయిన్ ఎవరో తెలిపోతే .. షూటింగ్ మొదలుపెడతారు .. త్వరలోనే హనుమాన్ జంక్షన్ లో ఈ సినిమా నుంచి ఓ పాటను కూడా రిలీజ్ చేయబోతున్నారని కూడా తెలుస్తుంది . అది కూడా హనుమంతునికి సంబంధించిన పాటని కూడా తెలుస్తుంది . ఈ సినిమాలో చిరంజీవికి జంటగా త్రిష హీరోయిన్గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే .