ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నిన్న ఆయన చేయబోయే అట్లీ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన బయటకు  వచ్చింది .. అలా బయటకు వచ్చిన వీడియో చూస్తే ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాల అనిపిస్తుంది .. ఇదే క్రమంలో అట్లీ బ‌న్నీ తో అంతకుమించిన ప్రయత్నం ప్రయోగం ఏదో చేయబోతున్నాడు అనేది కూడా ఇన్సైడ్ వర్గాల టాక్ .. అలాగే ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు రూ. 600 కోట్లకు పైగా ఉంటుందని కూడా అంటున్నారు .. ఇక పుష్పా తో 1000 కోట్ల క్లబ్లో చేరాడు అల్లు అర్జున్ ..


ఇక ఇప్పుడు మరోసారి ఈ క్లబ్లో తన పేరు మరో ఎత్తుకు తీసుకువెళ్లాలని ఆరాటపడుతున్నాడు .. అయితే ఇప్పుడు ఈ సినిమా లో బన్నీ తప్ప మిగిలిన నటుల గురించి ఎలాంటి వివరాలు బయటకు రాలేదు .. అయితే ఇప్పుడు హీరోయిన్ పాత్ర కోసం ఈ సినిమాలో సమంత పేరును పరిశీలిస్తున్నారని ఇన్సైడ్ వర్గాల టాక్ .. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ , సమంత జంటగా నటించారు .. ఇక తర్వాత పుష్పా లో స్పెషల్ సాంగ్లో కలిసి మెరిశారు .. ఆ తర్వాత ఇద్దరూ జోడి కట్టడం ఇదే తొలిసారి .  


అయితే ఈ మధ్య సమంతకు యాక్షన్ ఇమేజ్ గట్టిగా వచ్చింది .. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుంది ఈ సినిమాలోను సమంత పాత్ర ఎంతో కొత్తగా ఉండబోతుందని , అలాగే ఆమెను ఈ సినిమాలో గ్లామర్ డాళ్‌గా చూపించడం లేదని కూడా తెలుస్తుంది .. అలాగే సమంత తో పాటు మరో హీరోయిన్ కూడా ఈ సినిమా లో ఉండబోతుందట .. అయితే ఆ పాత్ర కోసం ఓ బాలీవుడ్ హీరోయిన్ ను ఎంచుకొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు .. జూన్‌లో ఈ సినిమా షూటింగ్ కు వెళ్లనుంది ఈ లోగా ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు బయటకు వస్తాయట .

మరింత సమాచారం తెలుసుకోండి: