డోనాల్డ్ ట్రంప్ ఏ ముహూర్తాన అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడో కానీ అప్పటినుంచి ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నాడు . తాను చెప్పిందే రైట్ అని మిగతా వాళ్ళ ఆలోచన మొత్తం రాంగ్ అని ఆయన సిద్ధాంతాలను అమెరికా ప్రజలపై రుద్దేస్తున్నారు.  అమెరికా ప్రజలు బాగుపడాలి అని మిగతా  దేశాల ప్రజలు ఇబ్బందులు పడే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు . మరీ ముఖ్యంగా వీసాల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా వెళ్లాలి అన్న జనాలకు కోలుకోలేని దెబ్బతీసింది అని చెప్పాలి.


ప్రపంచ దేశాలలోని వివిధ రంగాలపై డోనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకున్న పాలసీల వల్ల ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది అందరికీ తెలిసిందే.  మరీ ముఖ్యంగా రాజమౌళి - మహేష్ బాబు కాంబోలో తెరకెక్కే సినిమాపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా చూపింది. అందుకే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు నెలల పాటు సినిమా షూటింగ్ కి బ్రేక్ చెప్పాడు రాజమౌళి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  రాజమౌళి సినిమా అంటేనే విజువల్ ఎఫెక్ట్స్  ఖచ్చితంగా ఉంటాయి . ఆయన సినిమాలలో కనిపించేదంతా వి ఎఫ్ ఎక్స్ అని చెప్పాలి .



రాజమౌళి - మహేష్ బాబు  సినిమాలో దాదాపు 80% విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయట . అది కూడా అమెరికాకు చెందిన ఒక భారీ కంపెనీతో చిత్ర యూనిట్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు టాక్ వినిపించింది.  అయితే డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయాల కారణంగా చిత్ర బడ్జెట్ డబల్ కాదు ట్రిపుల్ స్థాయిలో పెరిగిపోయిందట.  మేకర్స్ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఎదురయిందట . ఆ కారణంగానే ఏం చేయాలేని  మూమెంట్ లో రాజమౌళి మూడు నెలల పాటు సినిమాకి బ్రేక్ చెప్పారట . ఆ కారణంగానే మహేష్ బాబు వేకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . రాజమౌళి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది..???

మరింత సమాచారం తెలుసుకోండి: