రామ్ చరణ్ .. మెగా పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఈ మధ్యకాలంలోనే టైం అస్సలు బాగోలేనట్టుంది . ఆ కారణంగానే సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ ఎదుర్కొంటూ వస్తున్నారు . కాగా రాంచరణ్ ప్రెసెంట్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు . ఆ తర్వాత సుకుమార్ తో మరొక సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ రెండు సినిమాలు అయిపోగానే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో ఒక సినిమాకి ఫిక్స్ అయ్యాడు రామ్ చరణ్ అంటూ టాక్ వినిపిస్తుంది.


ఇలాంటి మూమెంట్లో రాంచరణ్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. గౌతం తిన్నూరి దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది . కానీ ఆ సినిమా పట్టాలు ఎక్కలేదు . ఆ సినిమా ఎందుకు క్యాన్సిల్ అయింది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.  గౌతమ్ తిన్నూరి విజయ్ దేవరకొండ ని హీరోగా పెట్టి "కింగ్ డమ్" అనే సినిమా చేస్తున్నాడు.  నిజానికి ఈ సినిమాను రాంచరణ్ తో చేయాలి అనుకున్నారట.  కానీ రామ్ చరణ్ కథ విని రిజెక్ట్ చేశారట . ఆ తర్వాత విజయ్ దేవరకొండ అందుకు ఓకే చెప్పాడు . దీంతో రామ్ చరణ్ తో చేయాల్సిన క్రేజీ ప్రాజెక్ట్ గౌతమ్ తిన్నూరి - విజయ్ దేవరకొండ తో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు పార్ట్లు గా తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.



అందుతున్న సమాచారం ప్రకారం మే  30వ తేదీ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమాతో మరొక బిగ్ హిట్  తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు గౌతమ్ తిన్నూరి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.  రాంచరణ్ మంచి ఛాన్స్ మిస్ అయిపోయాడు అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి విజయ్ దేవరకొండకి ఎలాంటి హిట్ ఇస్తాడో డైరెక్టర్ గౌతమ్ తిన్నూరి..????

మరింత సమాచారం తెలుసుకోండి: