ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు నిన్నటి రోజున సింగపూర్లో పాఠశాలలో సమ్మర్ క్యాంపు జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే ..ఈ ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు అయ్యాయి.. ముఖ్యంగా చేతులకు ,కాళ్లకు కూడా గాయాలు అవ్వడమే కాకుండా ఊపిరితిత్తులలో పొగ చేరినట్లు పవన్ కళ్యాణ్ నిన్నటి రోజున తెలియజేశారు. ప్రస్తుతం మార్క్ సింగపూర్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. తన కుమారుడిని చూసేందుకు పవన్ కళ్యాణ్ అటు మెగా కుటుంబ సభ్యులకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఆర్య అన్నాలెజినోవా సింగపూర్ లోని నివసిస్తున్నట్లు సమాచారం.



తాజాగా మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి  పవన్ కళ్యాణ్ టీమ్ ఒక అప్డేట్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కు కోలుకుంటున్నారని ఊపిరితిత్తులలో పొగ పట్టేయడం వల్ల వచ్చే ఆరోగ్యకరమైన ఇబ్బందులకు సంబంధించినా వాటికి పరీక్షలు వైద్యులు చేస్తున్నారని తెలియజేశారు.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  నిన్నటి రోజున రాత్రి హైదరాబాదు నుంచి సింగపూర్ కి వెళ్లారు. నేరుగా మార్క్ ఉండే హాస్పిటల్ కి వెళ్లినట్లు తెలుస్తోంది.


మార్క్ ను మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండేలా అక్కడ వైద్యులు తెలియజేశారట. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి తెలిసి చాలామంది సెలబ్రిటీలు, పలువురు రాజకీయ నాయకులూ కూడా రియాక్ట్ కావడం జరిగింది.. పవన్ కళ్యాణ్ కుమారుడు త్వరగా కోలుకోవాలంటు పలువురు సెలబ్రిటీలు కూడా రాదు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కుమారుడికి ఆరోగ్యం కుదుట ఉందని తెలియజేయడంతో కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం OG, హరిహర వీరమల్లు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ లు కొంతమేరకు ఆలస్యం కావడం చేత ఈ సినిమాలు విడుదల కూడా ఆలస్యంగా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: