గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందనే సంగతి తెలిసిందే. నిన్న అల్లు అర్జున్ పుట్టినరోజు కాగా బన్నీ పుట్టినరోజు గురించి పవన్ విష్ చేయలేదు. చరణ్ పుట్టినరోజు సందర్భంగా విష్ చేసిన పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పుట్టినరోజుకు మాత్రం విషెస్ చెప్పకపోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వివాదం అంతకంతకూ ముదురుతోంది.
 
మరోవైపు పవన్ చిన్న కుమారుడు నిన్న గాయాలపాలైన సంగతి తెలిసిందే. అయితే ఎంతోమంది ప్రముఖులు పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని రియాక్ట్ కాగా అల్లు అర్జున్ మాత్రం ఇందుకు సంబంధించి రియాక్ట్ కాలేదు. పవన్, బన్నీ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందని అభిమానులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇరు హీరోల ఫ్యాన్స్ గొడవ పడటం వల్ల ఇద్దరు హీరోలకు నష్టమేనని చెప్పవచ్చు.
 
హీరోల తీరులో అభిమానుల తీరులో మార్పు వస్తే మాత్రమే ఈ పరిస్థితి మారే అవకాశాలు అయితే ఉంటాయి. అల్లు అర్జున్ తాజాగా అట్లీ డైరెక్షన్ లో సినిమాకు సంబంధించి ప్రకటన చేశారు. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సైతం ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.
 
టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రాబోయే రోజుల్లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు రానున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ ఏడాది పెద్ద సినిమాలు ఎక్కువగా రిలీజ్ కావడం లేదనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది రిలీజ్ కానున్న భారీ బడ్జెట్  సినిమాలలో ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: